ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటన... మరి ట్రంప్ అంగీకరించాడా!
Thu Jun 12, 2025 10:02 U S A.202506125849.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ స్నేహబంధం చిగురించినట్లే కన్పిస్తోంది. అధ్యక్షుడిపై తాను చేసిన తీవ్ర ఆరోపణలపై మస్క్ (Elon Musk) పశ్చాత్తాపం చెందారు. దీనిపై అధ్యక్షుడికి ప్రైవేటుగా ఫోన్ చేసిన ఆయన.. ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తంచేశారు. అటు ట్రంప్ (Donald Trump) కూడా టెస్లా అధినేతను క్షమించారు. ఈ మేరకు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మస్క్ తన 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా పోస్టులపై చింతిస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి' అని విచారం వ్యక్తం చేశారు. అయితే, దీనికంటే ముందు సోమవారం అర్ధరాత్రి అధ్యక్షుడికి మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ ఆరోపణలకు గానూ ట్రంప్ నకు ఆయన సారీ చెప్పినట్లు పేర్కొన్నాయి. గత శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూసీ విల్స్ మస్క్ ఫోన్లో సంభాషించారు. ట్రంప్తో విభేదాలు పరిష్కరించుకోవాలని టెస్లా అధినేతకు వారు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందించారు.
ఇది కూడా చదవండి: కృష్ణంరాజు బహుముఖ వేషాలు.. శ్రీకాకుళంలో అరెస్ట్ చేసిన తుళ్ళూరు పోలీసులు...
"ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారు. దీన్ని ఆయన అభినందించారు. అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి కొనసాగుతోంది” అని ఆమె తెలిపారు. ఇక, ట్రంప్ చెప్పినట్లు మస్కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా? అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ప్రభుత్వం రూపొందించిన 'బిగ్ బ్యూటిపుల్ బిల్లు'ను టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్నకు, ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈక్రమంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎఫ్లైన్తో ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వెనక్కి తగ్గుతూ నిన్న పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #trump #musk #apology #usa #america #billigates #telugunews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.